Bandla Ganesh: పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం గురించి ఎవరు మాట్లాడినా నేను సహించను: బండ్ల గణేష్

Bandla Ganesh is my God
  • పవన్ నిజాయతీ, నిబద్ధత నాకు తెలుసు
  • పవన్ నాకు దైవంతో సమానం
  • పవన్ అంటే నాకు చాలా ఇష్టం

జనసేనాని పవన్ కల్యాణ్ కు వీరాభిమానిగా నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కు పేరుంది. తాజాగా మరోసారి పవన్ పై తన ప్రేమాభిమానాలను ఆయన చాటుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ నుంచి తప్పుకుని, బీజేపీకి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. బీజేపీలో చేరితే సరిపోతుంది కదా? అని ఆయన ఎద్దేవా చేశారు.

 ఈ వ్యాఖ్యలపై బండ్ల గణేశ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ఎన్నికల సమయం కాబట్టి రాజకీయాలు మాట్లాడకూడదని తానేం మాట్లాడటం లేదని అన్నాడు. తనకు ఏ రాజకీయ పార్టీలో సంబంధం లేదని చెప్పారు. పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని... ఆయన నిజాయతీ, నిబద్ధత ఏమిటో తనకు తెలుసని అన్నారు.

పవన్ మహోన్నతమైన వ్యక్తి అని గణేశ్ చెప్పారు. రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చని, రాజకీయాలు ఎవరైనా మాట్లాడవచ్చని... కానీ, పవన్ గురించి కానీ, ఆయన వ్యక్తిత్వం గురించి కానీ ఎవరైనా మాట్లాడితే తాను సహించనని అన్నారు. తనకు పవన్ దైవంతో సమానమని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది సాంకేతిక నిపుణులను, ఎంతో మంది నిర్మాతలను పరిచయం చేసిన ఘనత పవన్ దేనని అన్నారు.

  • Loading...

More Telugu News