కొనసాగుతున్న గ్రేటర్ పోలింగ్... మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 18.22 శాతం ఓటింగ్
- జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో ఓటింగ్
- అత్యధికంగా గుడిమల్కాపూర్ లో 49.19 శాతం నమోదు
- అత్యల్పంగా రెయిన్ బజార్ డివిజన్ లో 0.56 శాతం పోలింగ్
జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఓటింగ్ కోసం బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కాగా, మధ్యాహ్నానికి కనీసం 20 శాతం కూడా ఓటింగ్ నమోదు కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో నగరంలోని ఐటీ ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లినట్టు తెలుస్తోంది.