భారత్తో రెండో వన్డేలో 300 దాటిన ఆస్ట్రేలియా స్కోరు
- ఏజే ఫించ్ 69 బంతుల్లో 60 పరుగులు
- డేవిడ్ వార్నర్ 77 బంతుల్లో 83
- సెంచరీ బాదిన స్మిత్
- ఆస్ట్రేలియా స్కోరు 44 ఓవర్ల వద్ద 314/3
మూడో ఆర్డర్ లో వచ్చిన స్మిత్ మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. దూకుడుగా ఆడుతూ 2 సిక్సులు, 14 ఫోర్లతో సెంచరీ బాదాడు. 104 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో లాబుస్చాగ్నే 51, మ్యాక్స్ వెల్ 10 పరుగులతో ఉన్నారు. ఆస్ట్రేలియా జట్టు స్కోరు 44 ఓవర్ల వద్ద 314/3గా ఉంది. భారత బౌలర్లలో షమీ, పాండ్యాలకు ఒక్కో వికెటు దక్కాయి.