Gujarat: ఆసుపత్రిలో చెలరేగిన మంటలు.. ఆరుగురు కొవిడ్ రోగుల సజీవ దహనం

Six Patients Dead as Fire Breaks Out in ICU of COVID Hospital in Rajkot
  • ఆసుపత్రిలో మొత్తం 33 మంది కొవిడ్ రోగులు
  • 27 మందిని కాపాడి మరో ఆసుపత్రికి తరలింపు
  • ఐసీయూ వార్డులో చెలరేగిన మంటలు
గుజరాత్‌లోని ఓ ఆసుపత్రిలో ఈ తెల్లవారుజామున చెలరేగిన మంటల్లో ఆరుగురు కొవిడ్ రోగులు సజీవ దహనమయ్యారు. రాజ్‌కోట్‌, మావ్‌డీ ప్రాంతంలోని శివానంద్ జనరల్ అండ్ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ ఆసుపత్రిలో జరిగిందీ ఘటన. ఇక్కడ మొత్తం 33 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురు ఐసీయూలో చికిత్స పొందుతుండగా, ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతున్న మరో 27 మందిని కాపాడి మరో ఆసుపత్రికి తరలించారు.

 ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంటలు తొలుత ఐసీయూ వార్డులో చెలరేగి ఆ తర్వాత ఆసుపత్రి మొత్తం వ్యాపించినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
Gujarat
covid patients
Fire Accident
Hospital
Rajkot

More Telugu News