వారిద్దరిపై గౌరవం ఉంటే భారతరత్న ఇవ్వండి: అమిత్ షాను డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి
- తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి చాటిన మహనీయుడు ఎన్టీఆర్
- ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చిన ఘనత పీవీది
- ఈ ఇద్దరు మహానాయకులకు భారతరత్న ఇవ్వాలి
వీరిద్దరిపైన ఎంతో గౌరవం ఉందని బీజేపీ చెపుతోందని... నిజంగా మీకు వారిపై గౌరవమే ఉంటే... కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వారికి భారతరత్న ఇవ్వాలని రేవంత్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను సందర్శించి, వారిద్దరికీ భారతరత్నను ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశంలో చర్చ పెట్టి, ఈ ఇద్దరు మహానాయకులకు మేము భారతరత్న ఇస్తున్నామని ప్రకటించాలని కోరారు.