Tapsee Pannu: 'నువ్వో చెత్త హీరోయిన్'వన్న నెటిజన్ కు తాప్సీ ఘాటు సమాధానం!

Tapsee Reply to Netizen goes viral
  • ఎంచుకుని మాత్రమే సినిమాలు చేస్తుంటావు
  • తాప్సీకి నటనే రాదని కామెంట్
  • తన ఇమేజ్ ను పెంచుకుంటున్నానన్న తాప్సీ
తన చిత్రాలతో దక్షిణాదిన సంపాదించలేక పోయిన స్టార్ డమ్ ను, ఉత్తరాదిన హిందీ సినిమాలతో పొందిన హీరోయిన్ తాప్సీ, సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇటీవల తన చిత్రాలను ఆమె అభిమానులతో షేర్ చేసుకోగా, ఓ నెటిజన్ ఆమె నటనపై విమర్శలు గుప్పించాడు. తాప్సీకి అసలు నటనే రాదని కామెంట్ పెట్టాడు. "నువ్వో ఫాల్తూ హీరోయిన్ వు. నువ్వు ఎత్తుకుని (ఎంచుకుని) సినిమాలు చేస్తుంటావు" అని వ్యాఖ్యానించాడు.

దీన్ని చూసిన తాప్సీ ఘాటుగా స్పందించింది. "ఏం ఎత్తుకుని సినిమాలు చేస్తున్నాను. నా ఇమేజ్ ను పైకి ఎత్తుతున్నా. నీకు మాత్రం ఈ విషయం అర్థం కావడం లేదు" అని తాప్సి కామెంట్ పెట్టింది. కాగా, 2016లో 'పింక్' చిత్రంలో నటించిన తరువాత బాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు తాప్సీని ఎదుర్కొంటూ వచ్చాయి. వరుస విజయాలు ఆమెను స్టార్ హీరోయిన్ గా మార్చాయి.
Tapsee Pannu
Netizen
Comment

More Telugu News