Cherukuvada Sriranganadha Raju: కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కమిటీలు వేశారు: మంత్రి శ్రీరంగనాథరాజు

Sriranganatha Raju says CM established committees for new districts
  • ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తులు
  • కమిటీల నివేదిక ఆధారంగా తుదినిర్ణయం
  • గుంటూరులో వెల్లడించిన మంత్రి శ్రీరంగనాథరాజు
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ, కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం జగన్ కమిటీలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ కమిటీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.

కాగా, మంత్రి శ్రీరంగనాథరాజు ఇవాళ గుంటూరు వచ్చారు. ఇక్కడి జీజీహెచ్ లో భవన నిర్మాణ పనులను పరిశీలించారు. రోగుల సహాయకుల విశ్రాంతి భవన నిర్మాణ పనులకు సంబంధించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ భవనంలో రోగుల సహాయకులకు ఉచిత భోజనం అందిస్తారని మంత్రి తెలిపారు. డిసెంబరు 10 నాటికి భవన నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించామని చెప్పారు.
Cherukuvada Sriranganadha Raju
New Districts
Andhra Pradesh
Committees

More Telugu News