హిందీలో సూర్య తాజా సినిమా రీమేక్!
- హీరో సూర్య తాజా చిత్రం 'ఆకాశం నీ హద్దురా'
- సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన సినిమా
- అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ద్వారా విడుదల
- హిందీ రీమేక్ కి ఆసక్తి చూపుతున్న షాహిద్
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపీనాథ్ ఆత్మకథ 'సింప్లీ ఫ్లయ్' ఆధారంగా దీనిని తెరకెక్కించారు. ఈ చిత్రం హీరో సూర్యకు, దర్శకురాలు సుధ కొంగరకు కూడా మంచి పేరుతెచ్చిపెట్టింది. ఈ క్రమంలో అప్పుడే ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 'జెర్సీ' హిందీ రిమేక్ లో నటిస్తున్న షాహిద్ కపూర్ కి ఈ చిత్రం బాగా నచ్చడంతో హిందీ రీమేక్ లో చేయడానికి ఆసక్తిగా వున్నాడట. ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ దీనిని రీమేక్ చేసే ప్రయత్నాలలో వుంది.