ట్రక్కులో వెళుతున్న నలుగురు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా బలగాలు
- శ్రీనగర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నం
- నగ్రోటా ప్రాంతంలోని బాన్ టోల్ ప్లాజా వద్ద ఘటన
- ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు
శ్రీనగర్ వైపు వెళ్తున్న ట్రక్కును తనిఖీ నిమిత్తం భద్రతా సిబ్బంది ఆపడానికి ప్రయత్నించారు. దీంతో అందులోని ఉగ్రవాదులు ఆటోమెటిక్ ఆయుధాలతో భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడడంతో వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని జమ్మూ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి.