సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- వచ్చే నెలలో 'ఆచార్య' షూటింగుకు కాజల్
- పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్?
- నాగేశ్వర్ రెడ్డితో సందీప్ కిషన్ సినిమా
* ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, రామ్ చరణ్ ల కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చరణ్ చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఇది వుండచ్చని అంటున్నారు. అన్నట్టు, చరణ్ తన మొదటి చిత్రం 'చిరుత'ను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన సంగతి విదితమే.
* ప్రస్తుతం 'ఏ1 ఎక్స్ ప్రెస్' చిత్రంలో నటిస్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్ తన తదుపరి చిత్రాన్ని జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో చేయనున్నాడు. వచ్చే నెల నుంచి దీని షూటింగ్ మొదలవుతుంది.