దేశానికి అవసరమైనప్పుడు హిందుత్వ ఖడ్గాన్ని బయటకు తీస్తాం: శివసేన నేత సంజయ్ రౌత్
- మా హిందుత్వం గురించి ఏ పార్టీ సర్టిఫికెట్ అవసరం లేదు
- ఎప్పుడూ మేము హిందుత్వవాదులమే
- ఆలయాలను మూసేసింది ప్రధాని మోదీనే
తమ హిందుత్వం గురించి తమకు ఏ పార్టీ సర్టిఫికెట్ అవసరం లేదని సంజయ్ రౌత్ మండిపడ్డారు. గతంలో, ఇప్పుడు, ఎప్పుడైనా సరే తాము హిందుత్వవాదులమేనని చెప్పారు. అయితే వారి మాదిరి తాము హిందుత్వ రాజకీయాలు చేయలేమని అన్నారు. మహారాష్ట్రలో దేవాలయాలను మళ్లీ తెరవాలని శివసేన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమ విజయమేనని బీజేపీ చేసిన వ్యాఖ్యలను సంజయ్ తప్పుపట్టారు.
దేశంలో లాక్ డౌన్ విధించింది ప్రధాని మోదీ అని, ఆలయాలను మూసేయాలని చెప్పింది కూడా ఆయనే అని... అందువల్ల ఈ విషయంలో హిందుత్వ గెలిచిందంటూ బీజేపీ క్రెడిట్ తీసుకోవాలనుకోవడంలో అర్థమేలేదని సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు.