దీపావళి టపాసు పేలి దగ్ధమైన రూ. 14 లక్షల విలువైన కొత్తకారు!
- హైదరాబాద్ శివారులో ఘటన
- దీపావళి చేసుకుందామని కారులో స్నేహితుల వద్దకు వచ్చిన బాధితుడు
- క్షణాల్లోనే కాలి బూడిదైన కారు
ఆ తర్వాత కాసేపటికే పెద్ద ఎత్తున మంటలు వస్తుండడంతో వెలుపలికి వచ్చి చూసిన అతడు నిర్ఘాంతపోయాడు. కారు మంటల్లో కాలి బూడిదవుతుండడంతో తట్టుకోలేకపోయాడు. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. క్షణాల్లోనే అది బూడిదైంది. అదే బస్తీకి చెందిన వేణు అనే వ్యక్తి సుత్లీబాంబు కాల్చి కారు పైకి విసరడంతో మంటలు చెలరేగినట్టు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.