పెళ్లి కుదిరింది పార్టీ ఇస్తానని పిలిచి.. యువతిపై సామూహిక అత్యాచారం
- ముంబైలోని ఓ హోటల్‌లో ఘటన
- బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం
- నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
పార్టీ అనంతరం ఇద్దరు యువతులు వెళ్లిపోగా, ఒక్క అమ్మాయిని మాత్రం ఉండమని చెప్పి మాటల్లో దించి బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం ఆమెపై అందరూ కలిసి అత్యాచారానికి పాల్పడి హోటల్ నుంచి పరారయ్యారు. ఘటన జరిగినప్పటి నుంచి మౌనంగా ఉంటూ తనలో తానే కుమిలిపోతున్న బాధితురాలు, ఎట్టకేలకు తల్లిదండ్రులకు విషయం చెప్పి భారం దించుకునే ప్రయత్నం చేసింది. వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.