అత్యంత దయనీయ పరిస్థితుల్లో సాయం కోరుతున్న తమిళ కమెడియన్
- క్యాన్సర్ తో బాధపడుతున్న నటుడు తావసి
- గుర్తు పట్టలేనంతగా మారిపోయిన నటుడు
- సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేసిన కుమారుడు
శివకార్తికేయన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'వరుత్తపడతా వాలిబర్ సంగం' అనే చిత్రంలో తావసి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అనేక తమిళ చిత్రాల్లో పూజారి పాత్రలు, జ్యోతిష్యుల పాత్రలతో అలరించాడు. ఇప్పుడాయన ఆసుపత్రి బెడ్ పై దీనంగా ఉండడాన్ని అభిమానులు భరించలేకపోతున్నారు. ఆయనకు సాయం చేయాలంటూ తమిళ నడిగర్ సంఘం కూడా పిలుపునిచ్చింది.