ఇంటిపై బ్యాగుల నిండా డబ్బు కట్టలు, బంగారం... కంగారుపడి పోలీసులకు సమాచారం అందించిన యజమాని!
- ఉత్తరప్రదేశ్ లో ఘటన
- ఉదయాన్నే లేచి ఇంటిపైకి వెళ్లిన వ్యక్తి
- రెండు బరువైన బ్యాగులు దర్శనం
- పక్కింటి వాచ్ మన్ పనే అని తేల్చిన పోలీసులు
పోలీసులు వచ్చి ఆ రెండు బ్యాగులను స్వాధీనం చేసుకుని, ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. వరుణ్ శర్మ ఇంటి పక్కనే ఉన్న భవనం పైనుంచి ఆ బ్యాగులను పడేసినట్టు గుర్తించారు.
ఆ భవనంలో పనిచేసే వాచ్ మన్ తన యజమానికి సంబంధించిన డబ్బు, బంగారం దోచుకుని బ్యాగుల్లో ఉంచి పక్కింటి డాబాపై పడేశాడు. తాను పనిచేస్తున్న ఇంటి గేటు నుంచి బ్యాగులను తీసుకెళితే సీసీ కెమెరాలకు దొరికిపోతానని భావించి, వాటిని పక్కింట్లో వేశాడు. దాంతో ఆ కాపలాదారును అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.