Melania Trump: మరో షాకిచ్చిన మెలానియా.. సైనికుడి చేయి పట్టుకుని నడిచిన వైనం

Melania Trump walks with soldier
  • వెటరన్స్ డే సందర్భంగా ఊహించని ఘటన
  • భర్తకు దూరంగా నడిచిన మెలానియా
  • ఇద్దరూ విడిపోనున్నారంటూ వెల్లువెత్తుతున్న వార్తలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమి తర్వాత ఆయన వైవాహిక జీవితం విచ్ఛిన్నం దిశగా అడుగులు వేస్తోంది. ఆయన నుంచి మెలానియా ట్రంప్ విడాకులు తీసుకోనుందనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమవుతున్నాయి. వెటరన్స్ డే సందర్భంగా తన భార్య మెలానియాతో కలిసి ఆర్లింగ్టన్ జాతీయ శ్మశానవాటికను సందర్శించారు.

 ఈ సందర్భంగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. మెలానియా ప్రవర్తించిన తీరు అందరినీ షాక్ కు గురి చేసింది. తన భర్తతో కలిసి నడవకుండా.. ఓ సైనికుడి చేయి పట్టుకుని మెలానియా నడిచింది. ఈ ఘటనతో అక్కడి వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటన తర్వాత వీరిద్దరూ విడిపోనున్నారనే వార్తకు మరింత బలం వచ్చింది. జనవరిలో ట్రంప్ అధ్యక్షపీఠం నుంచి వైదొలగగానే వీరి వివాహబంధం ముగుస్తుందని చెపుతున్నారు.
Melania Trump
Donald Trump
USA

More Telugu News