పుస్తకం రాసిన సోనూసూద్.. డిసెంబర్లో విడుదల!
- వలస కార్మికులను ఆదుకున్న సోనూసూద్
- రియల్ హీరో అనిపించుకున్న రీల్ విలన్
- 'అయామ్ నో మెస్సయ్య' పేరిట పుస్తకం
అందుకే అతని అంతా ఇప్పుడు 'మెస్సయ్య' (రక్షకుడు) అంటూ అతనికి తమ మనసులలో దైవ స్థానాన్ని కట్టబెట్టారు. అయితే, తాను మాత్రం మెస్సయ్యను ఎంతమాత్రం కానని సోనూసూద్ వినమ్రంగా చెబుతున్నాడు. ఇందుకోసం ఏకంగా ఓ పుస్తకాన్ని రాశాడు. దీని పేరు 'అయామ్ నో మెస్సయ్య!' జర్నలిస్టు మీనా అయ్యర్ తో కలసి ఆయన ఈ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియా సంస్థ ప్రచురిస్తోంది.
ఈ సందర్భంగా సోనూసూద్ చెబుతూ, 'నేనూ మామూలు మనిషినే. ఆ సమయంలో నేను చేయగలిగిన సాయం చేశాను అంతే. అయితే, ప్రజలు నా పట్ల ఎక్కువ దయ చూపిస్తున్నారు. సాటి మనిషికి సాయం చేయడం మన బాధ్యత. ఇక ఈ పుస్తకం డిసెంబర్లో మార్కెట్లోకి వస్తుంది. ఇది నా జీవిత చరిత్ర.. అంటే వేలాదిమంది వలస కార్మికుల కథ' అంటూ ట్వీట్ చేశాడు.