టీమిండియాకు కొత్త యూనిఫాం... 90వ దశకం నాటి డిజైన్ తో నయా జెర్సీలు!
- నవంబరు 27 నుంచి ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన
- డార్క్ బ్లూ కలర్ లో కొత్త జెర్సీలు
- ఇటీవలే ఎంపీఎల్ స్పోర్ట్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న బీసీసీఐ
తాజాగా బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న ఎంపీఎల్ స్పోర్ట్స్ సంస్థ అలనాటి డిజైన్ తో భారత జాతీయ జట్టు క్రికెటర్ల కోసం కొత్త జెర్సీలు రూపొందించింది. అంతేకాదు, మ్యాచ్ విరామాల్లో ధరించేందుకు అనువైన దుస్తులతో పాటు ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రయాణాల్లో మరింత ఆరోగ్య రక్షణ నిచ్చే వినూత్నమైన డ్రెస్సులను కూడా టీమిండియా ఆటగాళ్లకు అందించింది.