Somu Veerraju: శ్రీవారి సంపదపై పాలకుల కన్నుపడింది: సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు

Somu Veerraju visited Tirumala Srivaru Today
  • పార్టీ నేతలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ఏపీ బీజేపీ చీఫ్
  • భక్తులు సమర్పించే ప్రతి రూపాయిని ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని డిమాండ్
  • పాలకులకు జ్ఞానాన్ని ప్రసాదించాలని వేడుకున్నానన్న వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ ఉదయం పార్టీ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా తీర్చిదిద్దేలా రాష్ట్రంలోని పాలకులకు జ్ఞానాన్ని ప్రసాదించాలని స్వామి వారిని కోరుకున్నట్టు చెప్పారు. అలాగే, ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీవారి సంపదపై ప్రభుత్వం కన్నుపడిందని అన్నారు. స్వామి వారికి భక్తులు సమర్పించే కానుకలు సహా ప్రతీ రూపాయిని ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
Somu Veerraju
BJP
Andhra Pradesh
Tirumala

More Telugu News