Uttarakhand: కరోనాకు బలైన ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ జీనా

Uttarakhand BJP MLA Surendra Singh Jeena passes away
  • ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి 
  • ఇటీవలే గుండెపోటుతో ఆయన భార్య మృతి
  • సాల్ట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నిక
దేశంలో కరోనా వైరస్ విజృంభణ నెమ్మదించినప్పటికీ ప్రజల ప్రాణాలను మాత్రం హరిస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు వదిలారు. తాజాగా ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ జీనాను కరోనా మహమ్మారి పొట్టనపెట్టుకుంది. కరోనా సోకడంతో ఇటీవల ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. నిన్న రాత్రి జీనా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

ఆయన భార్య ఇటీవలే గుండెపోటుతో మృతి చెందారు. అంతలోనే జీనా మృతి ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 8 డిసెంబరు 1969లో అల్మోరా జిల్లాలోని సాదిగావ్‌లో జీనా జన్మించారు. 2007లో తొలిసారి బిక్యాసెన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అల్మోరా జిల్లాలోని సాల్ట్ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Uttarakhand
BJP
Surendra Singh Jeena
passes away

More Telugu News