బండి సంజయ్ కి ఫోన్ చేసిన అమిత్ షా
- దుబ్బాక గెలుపుపై సంజయ్ కు అమిత్ షా అభినందన
- అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన సంజయ్
- శ్రీనివాస్ కు విజయాన్ని అంకితం చేస్తున్నామన్న సంజయ్
ప్రస్తుతం హైదరాబాదులోని బీజేపీ కార్యలయం వద్ద కోలాహలం నెలకొంది. రాష్ట్ర కీలక నేతలంతా కార్యాలయంలో ఉన్నారు. మరోవైపు అమరవీరుల స్తూపం వద్ద బండి సంజయ్ నివాళులు అర్పించారు. దుబ్బాక గెలుపును అమరవీరుడు శ్రీనివాస్ కు అంకితమిస్తున్నట్టు చెప్పారు.