జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతాం: డీకే అరుణ
- రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
- దుబ్బాక గెలుపే దీనికి నిదర్శనం
- టీఆర్ఎస్ ను దుబ్బాక ప్రజలు తిరస్కరించారు
టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలకు పాల్పడినా, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు యత్నించినా ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని అన్నారు. బీజేపీ పట్ల విశ్వాసం ఉంచి, గెలిపించారని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు వస్తాయని అన్నారు.