RJD: బీహార్ లో కొనసాగుతున్న కమలం జోరు!

Tejaswi party slightly lost advantage to BJP
  • బీహార్ లో కొనసాగుతున్న కౌంటింగ్
  • ఆధిక్యంలో ఎన్డీయే కూటమి
  • క్రమంగా తగ్గుతూ వచ్చిన ఆర్జేడీ ఆధిక్యం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఓ ప్రభంజనంలా ప్రచారం సాగించిన ఆర్జేడీ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ఆశలు తీరేలా లేవు. ఉదయం జోరు కనబర్చిన ఆర్జేడీ ఓట్ల లెక్కింపు కొనసాగే కొద్దీ స్వల్ప తేడాతో వెనుకబడింది.

ప్రస్తుత ట్రెండ్స్ గమనిస్తే... బీహార్ అసెంబ్లీలోని మొత్తం 243 స్థానాలకు గాను ఒక స్థానం ఫలితం ఖరారైంది. ఆ స్థానం ఆర్జేడీ గెలుచుకుంది. ఆ పార్టీ మరో 64 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అటు బీజేపీ 77 స్థానాల్లో అధిక్యంలో ఉంది. బీజేపీ మిత్రపక్షం జేడీయూ 47 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతోంది. ఈ క్రమంలో పార్టీల మధ్య హోరాహోరీ నెలకొంది.

ఈ ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన సమయంలో ట్రెండ్స్ గమనిస్తే ఆర్జేడీ హవా ఖాయమనిపించింది. కొన్నిరౌండ్లలో ఆ పార్టీ ఆధిక్యం 130 స్థానాలకు వరకు ఎగబాకింది. అయితే, ఎన్డీయే కూటమి పార్టీలు ఆ తర్వాత పుంజుకోవడంతో ఆర్జేడీ ఆధిక్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది.

అటు గుజరాత్ లో 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండగా బీజేపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు 3 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ, మిగిలిన 5 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉంది.

కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ హవా సాగించింది. రెండింటికి రెండు స్థానాలను చేజిక్కించుకుంది.

ఉత్తరప్రదేశ్ లో 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోస్థానంలో సమాజ్ వాదీ పార్టీ పైచేయి సాధించింది.
RJD
Tejashwi Yadav
Bihar
BJP

More Telugu News