22వ రౌండ్ లో మెజార్టీ సాధించిన బీజేపీ.. మిగిలింది ఒక రౌండు మాత్రమే!

BJP gets lead in 22 round
  • 22వ రౌండులో 438 లీడ్ సాధించిన బీజేపీ
  • మొత్తంమీద 1,058 ఆధిక్యత
  • లెక్కించాల్సిన ఓట్లు 5,571 మాత్రమే
దుబ్బాక ఉప ఎన్నికలలో ఫలితాలు టెన్షన్ రేకెత్తిస్తున్నాయి. 22వ రౌండులో  బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 438 ఓట్ల ఆధిక్యత సాధించారు. ఈ ఆధిక్యతతో కలిపి ఆయనకు మొత్తంమీద 1,058 లీడింగ్ లభించింది. మరో రౌండు కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉంది. చివరి రౌండ్ లో 5,571 ఓట్లను మాత్రమే లెక్కించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చివరి రౌండ్ లో టీఆర్ఎస్ భారీ ఆధిక్యత సాధిస్తే తప్ప విజయం సాధించడం అసాధ్యం. దీంతో చివరి ఓటు వరకు దుబ్బాకలో టెన్షన్ గానే ఉంటుంది.

Go Back to Shorts
Dubbaka
BJP
TRS
Congress

More Telugu News