దుబ్బాక ఉపఎన్నిక.. ఐదో రౌండ్ లో కూడా బీజేపీకి ఆధిక్యత!
- దుబ్బాకలో కొనసాగుతున్న రఘునందన్ రావు దూకుడు
- ఐదో రౌండ్ ముగిసే సరికి రఘునందన్ కు 3,020 ఓట్ల ఆధిక్యం
- దారుణమైన స్థితిలో కాంగ్రెస్ పార్టీ
బీజేపీకి ఇప్పటి వరకు 16,517 ఓట్లు రాగా... టీఆర్ఎస్ కు 13,497 ఓట్లు పడ్డాయి. 2,724 ఓట్లను మాత్రమే సాధించిన కాంగ్రెస్ పార్టీ దారుణమైన స్థితిలో ఉంది. అయితే, రానున్న రౌండ్లలో ఫలితాలలో ఏదైనా మార్పు వస్తుందా? లేక ఇదే సరళి కొనసాగుతుందా? అనేది వేచి చూడాలి.