Lalu Prasad Yadav: నీకు బీహార్ ప్రజలు పుట్టినరోజు కానుకను ఇవ్వబోతున్నారు: తనయుడితో లాలూ ప్రసాద్ యాదవ్

Lalu Yadav Says Bihar Will Give Tejashwi Yadav Gift On Counting Day
  • రాంచీ జైల్లో ఉన్న లాలూ ప్రసాద్
  • జైల్లో ఉన్న లాలూ సహాయకుడికి ఫోన్ చేసిన తేజస్వి 
  • కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన లాలూ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మహాకూటమికే అనుకూలంగా వెలువడుతున్నాయి. ఇప్పటికే పాట్నాలోని తేజస్వి నివాసం వద్ద పార్టీ కార్యకర్తలు సంబరాలను ప్రారంభించారు. మరోవైపు, తన కుమారుడి విజయం గురించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తేజస్వి నిన్న 31వ పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లాలూ మాట్లాడుతూ తేజస్వికి బీహార్ ప్రజలు పుట్టినరోజు కానుకను ఇవ్వబోతున్నారని అన్నట్టు సమాచారం.

ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. జైలు నుంచి ఆయన మాట్లాడుతూ తన కుమారుడి విజయం గురించి ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం. లాలూ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి అందించిన వివరాల ప్రకారం... ఆదివారం అర్ధరాత్రి లాలూ సహాయకుడి ఫోన్ కు తేజస్వి రెండు సార్లు ఫోన్ చేశారు. ఆ సమయంలో లాలూ నిద్రిస్తున్నారు. దీంతో నిన్న ఉదయం 6 గంటలకు మరోసారి ఫోన్ చేయగా లాలూ లైన్లోకి రాలేదు. ఆ తర్వాత తన కుమారుడికి లాలూనే స్వయంగా ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నీకు బీహార్ ప్రజలు బహుమతిని ఇవ్వబోతున్నారని తన కుమారుడితో లూలూ చెప్పారు.
Lalu Prasad Yadav
Tejashwi Yadav
RJD
Birthday

More Telugu News