Narendra Modi: సరిహద్దుల్లో ఉద్రిక్తతల తరువాత తొలిసారి... నేడు జిన్ పింగ్ తో ముఖాముఖి మాట్లాడనున్న నరేంద్ర మోదీ!

Modi Joins SCO With Putin Jinping and Imran Today
  • నేడు ఎస్సీఓ అధినేతల సమావేశం
  • రష్యా అధ్యక్షతన వర్చ్యువల్ విధానంలో మీటింగ్
  • పాల్గొననున్న ఇమ్రాన్, జిన్ పింగ్ తదితరులు
ఈ సంవత్సరం మే నెలలో చైనా సరిహద్దుల్లో జరిగిన అవాంఛనీయ ఘటనలు ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక దూరాన్ని పెంచగా, నేడు తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో ముఖాముఖి మాట్లాడనున్నారు. ఇందుకు నేడు జరిగే 20వ ఎస్సీఓ అధినేతల సమావేశం వేదిక కానుంది.

వర్చ్యువల్ గా సాగనున్న ఈవెంట్ లో సీమాంతర ఉగ్రవాదం, భారత సార్వభౌమత్వం, వివిధ దేశాల మధ్య ఆర్థిక సహకారం, ఆఫ్ఘనిస్థాన్ లో జరుగుతున్న దాడులు, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధి, కరోనా కట్టడి తదితర అంశాలను మోదీ ప్రస్తావించనున్నారు. ఇక ఈ సమావేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన సాగనుండగా, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా పాల్గొననున్నారు.

ఇక ఇమ్రాన్ ఖాన్ సమక్షంలోనే, ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలకు నరేంద్ర మోదీ సీరియస్ వార్నింగ్ ఇస్తారని తెలుస్తోంది. ఆయా దేశాలు తక్షణమే ఉగ్రవాదాన్ని వదిలేయాలని, అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని మోదీ డిమాండ్ చేయనున్నారు. ఈ సమావేశం అనంతరం, మాస్కో డిక్లరేషన్ వెలువడనుండగా, పలు ఎస్సీఓ స్టేట్ మెంట్లు కూడా విడుదల కానున్నాయి.

రెండవ ప్రపంచ యుద్ధం జరిగి 75 సంవత్సరాలు పూర్తి కావడం, కరోనాపై పోరాటం, కౌంటర్ టెర్రరిజం, డ్రగ్ థ్రెట్ తదితర అంశాలపై ఎస్సీఓ సమావేశం అనంతరం ప్రకటనలు వెలువడనున్నాయి. పలు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలపైనా నేతలు ఓ ప్రకటన చేయనున్నారు.
Narendra Modi
Xi Jinping
Vladimir Putin
SCO Meeting
Imran Khan

More Telugu News