Bihar: అదంతా ఒట్టిదే.. మేం ఘన విజయం సాధించబోతున్నాం: షాన్వాజ్ హుస్సేన్

Shahnawaz Hussain says NDA will win in Bihar Elections
  • నితీశ్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు
  • మోదీ, నితీశ్‌పై బీహార్ ప్రజలకు అచంచల విశ్వాసం
  • ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నమ్మాల్సిన పనిలేదు
బీహార్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా అక్కడ విజయం సాధించబోయేది తామేనని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాన్వాజ్ హుస్సేన్ ధీమా వ్యక్తం చేశారు. బీహార్‌లో తాము ఘన విజయం సాధించబోతున్నట్టు చెప్పారు.  నితీశ్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.

ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లపై బీహార్ ప్రజలకు అచంచల విశ్వాసం ఉందన్నారు. అందుకనే ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేశారని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నమ్మాల్సిన పనిలేదని, అవి పూర్తిగా అవాస్తవమని పేర్కొన్న షాన్‌వాజ్.. ఫలితాలు మాత్రం ఎన్డీయేకు అనుకూలంగా ఉంటాయని తేల్చి చెప్పారు.
Bihar
Assembly polls
Shahnawaz Hussain
BJP
Nitish Kumar
Narendra Modi

More Telugu News