Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Kajal plans to arrange wedding reception
  • హైదరాబాద్, చెన్నైలలో కాజల్ వివాహ విందు
  • మారేడుమిల్లి అడవులలో 'పుష్ప' షూటింగ్
  • ఓటీటీ ద్వారా కల్యాణ్ దేవ్ 'సూపర్ మచ్చి'?    
*  ఇటీవలే ప్రియుడు గౌతమ్ ను వివాహమాడి, ప్రస్తుతం మాల్దీవులలో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న కథానాయిక కాజల్ అక్కడి నుంచి రాగానే వివాహ విందును ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. టాలీవుడ్ మిత్రుల కోసం హైదరాబాదులోను, కోలీవుడ్ మిత్రుల కోసం చెన్నై లోను రిసెప్షన్ ను ఏర్పాటు చేస్తుందట.  
*  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ నేడు తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవులలో ప్రారంభం అవుతోంది. హీరో బన్నీ సహా యూనిట్ మొత్తం ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.
*  చిరంజీవి రెండో అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం 'సూపర్ మచ్చి' ఇటీవలే షూటింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ ఓటీటీ సంస్థ ఈ విషయంలో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
Kajal Agarwal
Allu Arjun
Sukumar
Rashmika Mandanna

More Telugu News