Revanth Reddy: ఇదీ నేటి తెలంగాణం: ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ‘సూసైడ్ లేఖ’ను పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డి

revanth reddy slams  trs
  • తెలంగాణ సర్కారుపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శలు 
  • ఇటీవల ఓ విద్యార్థిని సూసైడ్
  • చదువుకు సాయం అందక ఆత్మహత్య చేసుకుందన్న రేవంత్ 
తెలంగాణ సర్కారుపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఓ విద్యార్థిని సూసైడ్ లేఖను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘రూ.వెయ్యి కోట్లతో ఏడంతస్తుల మేడలు (సచివాలయం) కట్టే రాష్ట్రంలో... చదువుకు సాయం అందక ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుంది. మొదటిది పాలకుడి విలాసం... రెండోది పేదరికపు విలాపం. ఇదీ నేటి తెలంగాణం’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

కాగా, తన చావుకు ఎవరూ కారణం కాదని, తన వల్ల ఇంట్లో చాలా ఖర్చులు అవుతున్నాయని తెలుపుతూ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తాను చదువు లేకపోతే బతకలేనని పేర్కొంది.  స్కాలర్ షిప్ లు ఏడాదికి ఒక్కసారైనా వచ్చేలా చేయాలని ఆమె పేర్కొంది.
Revanth Reddy
Congress
TRS
Telangana

More Telugu News