dulam nageshearrao: మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ నిర్ధారణ!

dulam tests corona positive
  • కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు కరోనా
  • స్వగ్రామం నుంచి చికిత్స కోసం హైదరాబాద్‌కు ఎమ్మెల్యే
  • ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స  
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని ఈ రోజు ఉదయం నిర్ధారణ అయింది. దీంతో ఆయన వెంటనే తన స్వగ్రామం నుంచి చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లారు.

ప్రస్తుతం దూలం నాగేశ్వరరావు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరినట్లు తెలిసింది. గత 10 రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఆయన సూచనలతో పలువురు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.
dulam nageshearrao
YSRCP
Andhra Pradesh
Hyderabad
Corona Virus

More Telugu News