Devineni Uma: వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?: దేవినేని ఉమ

What action you take on Red Sandal smugglers asks Devineni Uma to Jagan
  • రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ పెద్ద ఎత్తున సాగుతోంది
  • కోట్లాది రూపాయలను దోచేస్తున్నారు
  • ఇన్ఫార్మర్ వ్యవస్థకు తూట్లు పొడిచారు
ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతోందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఎర్రచందనం భారీగా తరలిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. ఎర్రచందనం స్మగ్లింగ్, దుంగలను విచ్చలవిడిగా తరలించడం ద్వారా కోట్లాది రూపాయల దోపిడీ యథేచ్చగా సాగుతోందని అన్నారు. నాడు కేసులతో అజ్ఞాతవాసం చేశారని, నేడు నేతలతో సహవాసం చేస్తున్నారని స్మగ్లర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇన్ఫార్మర్ వ్యవస్థకు తూట్లు పొడిచారని... స్మగ్లింగ్ పై సమాచారం ఇచ్చిన వారికి... స్మగ్లర్ల నుంచి బెదిరింపులు వస్తున్నాయని అన్నారు. తెరవెనక దోచేస్తూ నాయకులుగా మారిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు జగన్ గారూ? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
Devineni Uma
Telugudesam
Jagan
YSRCP
Red Sandal

More Telugu News