Mahesh Babu: టూర్ కు వెళుతూ ఎయిర్ పోర్టులో సందడి చేసిన మహేశ్ బాబు ఫ్యామిలీ... ఫొటోలు ఇవిగో!

Mahesh Babu family members at Hyderabad International airport
  • లాక్ డౌన్ తర్వాత కుటుంబంతో కలిసి మహేశ్ టూర్
  • కొత్త పరిస్థితులకు అలవాటు పడుతున్నామన్న మహేశ్
  • మళ్లీ జీవనయానం మొదలు అంటూ ట్వీట్
టాలీవుడ్ హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబుది ప్రత్యేక పంథా. సినిమా షూటింగ్ ల మధ్య విరామం దొరికితే చాలు తన కుటుంబంతో కలిసి ప్రముఖ పర్యాటక స్థలాలకు చెక్కేస్తుంటారు. అయితే ఇన్నాళ్లు కరోనా వ్యాప్తి కారణంగా ఇంటికే పరిమితమైన ఆయన నేడు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు బయల్దేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మహేశ్ బాబు, గౌతమ్, సితార సందడి చేశారు.

దీనిపై మహేశ్ ట్విట్టర్ లో స్పందించారు. "కొత్త పరిస్థితులకు అలవాటుపడుతున్నాం. సురక్షితమైన ప్రయాణం కోసం సర్వం సిద్ధమైంది. మళ్లీ జీవనయానం మొదలైంది. ఇంకెందుకాలస్యం పదండి పోదాం!" అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు 'సర్కారువారి పాట' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Mahesh Babu
Family
Tour
Corona Virus
Tollywood

More Telugu News