తన కొత్త సినిమా కోసం పనిచేసిన వందలమందికి దీపావళి కానుక ఇచ్చిన తమిళ హీరో శింబు
- 'ఈశ్వరన్' చిత్రంలో నటిస్తున్న శింబు
- మరికొన్నిరోజుల్లో దీపావళి
- ఒక గ్రాము బంగారు నాణెం కానుకగా ఇచ్చిన శింబు
- జూనియర్ ఆర్టిస్టులకు కొత్త దుస్తులు
మరికొన్నిరోజుల్లో దీపావళి వస్తుండడంతో శింబు తన యూనిట్ సభ్యులను సర్ ప్రైజ్ చేశాడు. 'ఈశ్వరన్' చిత్రం కోసం పనిచేస్తున్న 400 మందికి ఒక గ్రాము బంగారు నాణెం కానుకగా ఇచ్చాడు. 200 మంది జూనియర్ ఆర్టిస్టులకు కొత్త దుస్తులు అందజేశాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది.