Tragedy: పత్తికొండ ఎమ్మెల్యే కాన్వాయ్ లో వాహనం బోల్తా.. ఇద్దరి దుర్మరణం

Tragedy happens on Pathikonda MLA birthday
షార్ట్స్‌లో చూడండి
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. జన్మదినం నాడు దైవదర్శనం చేసుకునేందుకు ఎమ్మెల్యే శ్రీదేవి కసాపురం ఆలయానికి వెళ్లి వస్తుండగా ఆమె కాన్వాయ్ లోని ఓ స్కార్పియో వాహనం బోల్తాకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు మరణించారు. వారిద్దరూ ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో ఐదుగురు తీవ్రగాయాల పాలయ్యారు.  వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దేవనకొండ మండలం కరిడికొండ వద్ద ఓ మోటార్ సైకిల్ ను తప్పించబోయి స్కార్పియో వాహనం బోల్తాపడింది.
Go Back to Shorts
Tragedy
Pathikonda MLA
Kangati Sridevi
Road Accident
YSRCP

More Telugu News