మహిళల టీ20 చాలెంజ్: టాస్ గెలిచిన సూపర్ నోవాస్

  • షార్జాలో కీలక మ్యాచ్
  • బ్యాటింగ్ ఎంచుకున్న హర్మన్ ప్రీత్
  • ఓడితే సూపర్ నోవాస్ ఇంటికే!
మహిళల టీ20 చాలెంజ్ పోటీల్లో భాగంగా ఇవాళ షార్జాలో సూపర్ నోవాస్, ట్రెయిల్ బ్లేజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సూపర్ నోవాస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది.

ఈ టోర్నీలో సూపర్ నోవాస్, ట్రెయిల్ బ్లేజర్స్ తో పాటు వెలాసిటీ జట్టు కూడా ఆడుతోంది. ఇప్పటివరకు ట్రెయిల్ బ్లేజర్స్, వెలాసిటీ చెరో విజయం నమోదు చేసుకోగా, ఈ మ్యాచ్ లో ఓడితే సూపర్ నోవాస్ ఇంటిముఖం పడుతుంది. అప్పుడు ఫైనల్లో ట్రెయిల్ బ్లేజర్స్, వెలాసిటీ జట్లు తలపడతాయి.

అలాకాకుండా, నేటి మ్యాచ్ లో సూపర్ నోవాస్ నెగ్గితే మెరుగైన రన్ రేట్ కలిగిన రెండు జట్లు ఫైనల్ ఆడతాయి. సూపర్ నోవాస్ కు హర్మన్ ప్రీత్, ట్రెయిల్ బ్లేజర్స్ కు స్మృతి మంథన, వెలాసిటీ జట్టుకు మిథాలీ రాజ్ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Supernovas
Trail Blazers
Toss
Sharjah
Womens T20 Challenge
IPL 2020

More Telugu News