Chiranjeevi: ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన చిరంజీవి, నాగార్జున

Tollywood heroes Chiranjeevi and Nagarjuna met CM KCR at Pragathi Bhavan
  • తెలంగాణ సీఎంతో చిరు, నాగ్ సమావేశం
  • వరద విరాళాల చెక్కుల అందజేత!
  • హీరోలను అభినందించిన సీఎం కేసీఆర్!
టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున ఇవాళ సీఎం కేసీఆర్ ను కలిశారు. హైదరాబాద్ ప్రగతిభవన్ కు వెళ్లిన చిరంజీవి, నాగార్జున తెలంగాణ సీఎంతో సమావేశమయ్యారు. ఇటీవల సంభవించిన వరదల నేపథ్యంలో తాము ప్రకటించిన విరాళాల చెక్కులను అందజేయడానికి సీఎం కార్యాలయానికి వెళ్లినట్టు సమాచారం.

ఈ సందర్భంగా కేసీఆర్ టాలీవుడ్ అగ్రహీరోలను సాదరంగా స్వాగతించారు. వారితో కాసేపు ముచ్చటించారు. ఆయన వారిని అభినందించినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ను చిరు, నాగ్ కలిసిన సమయంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు.
Chiranjeevi
Nagarjuna
KCR
Pragathi Bhavan
Hyderabad
Tollywood

More Telugu News