Undavalli Sridevi: ఆడియోలో గొంతు నాది కాదు: ఉండవల్లి శ్రీదేవి స్పష్టీకరణ

Undvalli Sridevi clarifies that is not her voice in audio clipping
  • వివాదంలో చిక్కుకున్న తాడికొండ ఎమ్మెల్యే
  • తాజాగా ఆడియో క్లిప్పింగ్ విడుదల చేసిన సందీప్
  • తన గొంతు మార్ఫింగ్ చేశారన్న ఉండవల్లి శ్రీదేవి
వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో తనకు ప్రాణహాని ఉందంటున్న వైసీపీ బహిష్కృత నేత సందీప్ తాజాగా విడుదల చేసిన ఆడియో క్లిప్పింగ్ తీవ్ర కలకలం రేపుతోంది. లాభసాటి వ్యాపారంగా మనం కూడా పేకాట ఆడిద్దామని, లక్షల్లో బిజినెస్ జరుగుతుంది అని ఎమ్మెల్యే  చెబుతున్నట్టుగా ఆ ఆడియో క్లిప్పింగ్ లో ఉండడం సంచలనం సృష్టిస్తోంది.

అయితే, ఆ ఆడియో క్లిప్పింగ్ లో ఉన్న గొంతు తనది కాదని ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. సందీప్, సురేశ్ తన వాయిస్ ను మార్ఫింగ్ చేసి ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఓ మిమిక్రీ ఆర్టిస్ట్ సాయంతో తన గొంతును అనుకరించి ఆ ఆడియో తయారుచేశారని ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు.

తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిద్దరి వెనుక ఓ నాయకుడు ఉన్నట్టు తెలిసిందని అన్నారు. ఆ నాయకుడు తన నియోజకవర్గానికి ఇన్ చార్జిగా రావడానికి పెద్ద ప్లాన్ తో ఉన్నాడని, అందుకే ఈ బ్యాచ్ ను తనపై ఉసిగొల్పుతున్నారని అన్నారు. ఎప్పటికైనా చెడుపై మంచి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Undavalli Sridevi
Audio
Voice

More Telugu News