బాలయ్య సినిమా నుంచి ఆ హీరోయిన్ తప్పుకుందా?
- బాలయ్య, బోయపాటి కాంబోలో తాజా చిత్రం
- కథానాయికగా ప్రయాగ మార్టిన్ ఎంపిక
- బాలయ్య సరసన చిన్నపిల్లలా ఉందన్న భావన
- మరో కథానాయిక కోసం ప్రయత్నాలు
అయితే, తాజాగా ఆమెను ఈ ప్రాజక్టు నుంచి తప్పించినట్టు వార్తలొస్తున్నాయి. చూడడానికి బాలకృష్ణ సరసన ఆమె జోడీ సరిపోలేదని, బాగా చిన్నపిల్లలా ఉందనీ దర్శక నిర్మాతలకు అనిపించిందట. దాంతో ఆమెను వద్దనుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఆ పాత్రకి మరో హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరోపక్క, సెకండ్ హీరోయిన్ పాత్రకు మాత్రం పూర్ణను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
'సింహా', 'లెజండ్' చిత్రాల తర్వాత మళ్లీ బాలకృష్ణతో బోయపాటి ఈ చిత్రాన్ని చేస్తుండడంతో ఈ ప్రాజక్టుకు బాగా క్రేజ్ వచ్చింది. లాక్ డౌన్ తర్వాత ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో మొదలైంది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.