Kamal Haasan: క‌మ‌లహాసన్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు.. ఇంటి వద్దకు భారీగా తరలి వ‌చ్చిన అభిమానులు

wishes to kamal
  • నేడు పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్న కమల్
  • అందరికీ అభివాదం చేస్తూ కమలహాసన్ కృతజ్ఞతలు
  • కమ‌ల్‌కు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల విషెస్
దిగ్గజ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ నేత కమలహాసన్ ఈ రోజు పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనను చూసి, శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన ఇంటి వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వారందరికీ అభివాదం చేస్తూ కమలహాసన్ కృతజ్ఞతలు తెలిపారు. పలువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా ఆయనకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

కాగా, న‌టుడిగానే కాకుండా నిర్మాతగా, రచయితగా, రాజకీయ నాయకుడిగా కమల్ తన సత్తా చాటారు.  ప్ర‌స్తుతం ఆయన భార‌తీయుడు-2లో నటిస్తున్నారు. అలాగే, బిగ్ బాస్ త‌మిళ సీజ‌న్ 4కు వ్యాఖ్యాతగా ఉన్నారు. కమల హాసన్ 1954, నవంబరు 7న జన్మించారు. సినీరంగంలోకి ప్రవేశించాక ఎన్నో అవార్డులను అందుకున్నారు. 2018లో మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించారు. ఆయన కూతుళ్లు శ్రుతి హాసన్, చంద్ర హాసన్ కూడా సినీ రంగంలో కొనసాగుతున్నారు.
Kamal Haasan
Tamilnadu
Tollywood

More Telugu News