దివ్యతేజస్విని హత్య కేసులో నాగేంద్రబాబు అరెస్ట్.. నేడు కోర్టుకు!
- గత నెల 15న తేజస్విని హత్య
- 22 రోజుల చికిత్స అనంతరం కోలుకున్న నిందితుడు
- పోలీసులు కస్టడీ కోరే అవకాశం
నిందితుడిని కోర్టులో హాజరుపరిచేందుకు 24 గంటల సమయం ఉండడంతో దిశ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా నాగేంద్రబాబు కొన్ని పేర్లు వెల్లడించాడని, వారిని కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు. నిందితుడిని నేడు కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు కస్టడీ కోరే అవకాశం ఉంది.