ఐపీఎల్ ఎలిమినేటర్: బెంగళూరుకు కళ్లెం వేసిన సన్ రైజర్స్ బౌలర్లు
- అబుదాబిలో ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్
- మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు
బెంగళూరు జట్టులో ఏబీ డివిలియర్స్ 56 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆరోన్ ఫించ్ 32 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ కు 3, నటరాజన్ కు 2 వికెట్లు లభించాయి. షాబాజ్ నదీమ్ ఓ వికెట్ తీశాడు. బెంగళూరు సారథి కోహ్లీ 6 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. పడిక్కల్ 1 పరుగుకే నిష్క్రమించగా, మొయిన్ అలీ డకౌట్ అయ్యాడు.