Hrutik Roshan: బాలీవుడ్ నటుడి హాలీవుడ్ ప్రయాణం!

Hritik Roshan in Hollywood movie
  • ప్రస్తుతం 'క్రిష్ 4'లో నటిస్తున్న హృతిక్ రోషన్ 
  • హాలీవుడ్ మల్టీ మిలియన్ ప్రాజక్టులో ఛాన్స్
  • ఆడిషన్స్ లో పాల్గొన్న హృతిక్ రోషన్
  • హాలీవుడ్ మూవీలో స్పై పాత్ర పోషించే అవకాశం   
బాలీవుడ్ లో హృతిక్ రోషన్ కు మంచి యాక్షన్ హీరోగా పేరుంది. మంచి ఫిజిక్ తో ఆకట్టుకునే హృతిక్ ఖాతాలో పలు హిట్ సినిమాలున్నాయి. ప్రస్తుతం 'క్రిష్ 4' చిత్రంలో నటిస్తున్న ఈ అందగాడికి హాలీవుడ్ సినిమాలలో కూడా నటించాలనేది చిరకాల కోరిక. అది త్వరలో సాకారమయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఈ విషయంలో ప్రస్తుతం హాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థతో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మల్టీ మిలియన్ ప్రాజక్టుగా నిర్మాణం జరుపుకునే ఓ చిత్రంలో హృతిక్ స్పై పాత్రలో లీడ్ క్యారెక్టర్ ను పోషించే అవకాశం వుంది. ఇందుకు సంబంధించి ఆ స్టూడియో నిర్వహించిన ఆడిషన్స్ లో కూడా అతను పాల్గొన్నాడు. దానికి సంబంధించిన ఆడిషన్ టేప్ ను రెండు వారాల క్రితమే హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థకు పంపినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం సదరు ఆడిషన్ టేప్ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ పరిశీలనలో ఉందనీ, అన్నీ సవ్యంగా జరిగితే ఇందులో హృతిక్ నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ ఈ సినిమా ఫైనల్ అయితే కనుక ప్రస్తుతం చేస్తున్న 'క్రిష్ 4' తర్వాత హృతిక్ చేసే సినిమా ఇదే అవుతుందని అంటున్నారు.

ఇక ఈ ప్రాజక్టు గురించిన మరిన్ని వివరాలు వెల్లడించడానికి హృతిక్ సన్నిహితులు కానీ, అతని హాలీవుడ్ అవకాశాలను పర్యవేక్షిస్తున్న ఏజన్సీ కానీ సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇప్పుడు ఏం మాట్లాడినా భావ్యం కాదని అన్నారు.
Hrutik Roshan
Krish 4
Hollywood

More Telugu News