Paritala Sriram: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పరిటాల శ్రీరామ్ భార్య.. పార్టీలో కూడా ప్రమోషన్!

Paritala sriram gets promotion as father
  • పరిటాల కుటుంబంలో పండుగ వాతావరణం
  • రవి మళ్లీ పుట్టాడంటూ అభిమానుల సంబరాలు
  • పార్టీ అధికార ప్రతినిధిగా శ్రీరామ్ కు ప్రమోషన్
తెలుగుదేశం పార్టీ నేత పరిటాల శ్రీరామ్ తండ్రయ్యాడు. ఆయన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారు. తమ కుటుంబంలోకి మరో వ్యక్తి రావడంతో పరిటాల కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.

మరోపక్క, పార్టీ నేతలు, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పరిటాల రవి మళ్లీ పుట్టాడని అభిమానులు సంబరపడిపోతున్నారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు పార్టీ పరంగా కూడా శ్రీరామ్ కు ప్రమోషన్ లభించింది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా శ్రీరామ్ ను నియమించారు.

తమకు కొడుకు పుట్టాడనే విషయాన్ని పరిటాల శ్రీరామ్ కూడా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
Paritala Sriram
Son
Telugudesam

More Telugu News