marriage: రెండో పెళ్లి చేసుకున్న సినీనటుడు సామ్రాట్... ఫొటోలు ఇవిగో!

samrat get married
షార్ట్స్‌లో చూడండి
పంచాక్షరి, బావ, అహ నా పెళ్లంట వంటి తెలుగు సినిమాల్లో  నటించి పేరు తెచ్చుకున్న
సామ్రాట్ రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆయన బిగ్‌బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్‌గానూ పాల్గొన్న విషయం తెలిసిందే. హర్షిత రెడ్డికి  విడాకులు ఇచ్చిన తర్వాత ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్తలు వచ్చాయి. అయితే, దానిపై నిన్నటి వరకు స్పష్టత లేదు. తాజాగా ఆయన సోదరి, మోడల్ శిల్పారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫొటోలు పోస్ట్ చేసింది.
    
సామ్రాట్ రెడ్డిని పెళ్లి కొడుకును చేసిన సందర్భంగా తీసిన ఫొటోలను ఇటీవల షేర్ చేసింది. తాజాగా, కాకినాడలో వివాహ వేడుక జరిగిందని, శ్రీలిఖితను ఆయన వివాహం చేసుకున్నాడని తెలుపుతూ మరికొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామ్రాట్ పెళ్లి నిరాడంబరంగా, దగ్గరి బంధువుల సమక్షంలో జరిగింది. వారి పెళ్లికి బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు తనీశ్, దీప్తీ సునైనా వంటి వారూ వచ్చారు.  

          
Go Back to Shorts
marriage
Tollywood
Bigg Boss

More Telugu News