Joe Viden: అందరమూ కలిసి ఈ విజయం సాధించాం: జో బైడెన్

Together We Will Win says Biden
  • విజయం తనదేనని ట్విట్టర్ లో ప్రకటన
  • పాత వీడియోలు వైరల్ చేస్తున్న మద్దతుదారులు
  • ప్రతి ఓటునూ లెక్కించాలని సూచించిన బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి ఒక్క మెట్టు దూరంలో ఉన్న డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్, రెండు గంటల క్రితం విజయం తనదేనని ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "ప్రతి ఒక్కరిపైనా, ఎన్నికల ప్రక్రియపైనా నమ్మకం ఉంచాం. అందరం కలిసి ఈ విజయాన్ని సాధించాం" అని వ్యాఖ్యానించారు.ఈ ట్వీట్ వైరల్ అయింది.

దీనికి రిప్లయ్ లు ఇస్తూ, ఎంతో మంది ట్వీట్లు పెట్టారు. ట్రంప్ మద్దతుదారులు ఏడుస్తుంటే చూసేందుకు ఆనందంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఇక, గడచిన 28 ఏళ్లుగా జో బైడెన్, ఉపాధ్యక్ష అభ్యర్థురాలు కమలా హారిస్ మధ్య ఉన్న బంధాన్ని తెలుపుతున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

ఇక మరికొందరైతే, వైట్ హౌస్ ముందు ఓ ట్రక్ నిలిచివుండగా, దానిలోకి సామాన్లు ఎక్కిస్తున్న పాత వీడియోలను పోస్ట్ చేస్తూ, ట్రంప్ సామాన్లు సర్దేసుకుంటున్నారంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. కాగా, బైడెన్ తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు పెడుతూ, ప్రతి ఓటునూ లెక్కించాలని కోరారు. ఓట్లను లెక్కించేది తానో లేదా ట్రంపో కాదని, తదుపరి అధ్యక్షుడిని నిర్ణయించి, తమ అభిప్రాయాన్ని నిక్షిప్తం చేసింది ప్రజలేనని అన్నారు.

Joe Viden
Donald Trump
USA
Elections

More Telugu News