Duddilla Sridhar Babau: తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు సోకిన వైరస్

Telangana congress mla duddilla Sridhar babu tested corona positive
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు కరోనా పాజిటివ్
  • ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఎమ్మెల్యే
  • తనను కలిసినవారంతా టెస్టులు చేయించుకోవాలన్న శ్రీధర్‌బాబు
తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు.పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తనతోపాటు తన సెక్యూరిటీ సిబ్బంది శ్రీనివాస్‌కు కూడా వైరస్ సోకినట్టు ట్వీట్ చేశారు. ప్రస్తుతం తామిద్దం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. తమ ఆరోగ్యం నిలకడగా ఉందన్న ఆయన ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కాగా, తెలంగాణలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా మహమ్మారి బారినపడి, చికిత్స అనంతరం కోలుకున్నారు.
Duddilla Sridhar Babau
Congress
Telangana
Manthani
Corona Virus

More Telugu News