Supernovas: రాణించిన ఆటపట్టు, హర్మన్‌ప్రీత్.. వెలాసిటీ విజయ లక్ష్యం 127 పరుగులు

Velocity target 127 runs
షార్ట్స్‌లో చూడండి
మహిళల టీ20 చాలెంజ్‌లో భాగంగా షార్జాలో వెలాసిటీతో జరుగుతున్న తొలి పోరులో సూపర్‌నోవాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సూపర్‌నోవాస్‌ను వెలాసిటీ బౌలర్లు కట్టడి చేశారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. ముఖ్యంగా ఏక్తా బిష్త్ బంతితో నిప్పులు చెరిగింది. 4 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది.

జహనారా ఆలం, లీ కాస్పెరెక్‌లు కూడా చక్కని బంతులు విసిరారు. ఇద్దరూ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. సూపర్‌నోవాస్ జట్టులో ఓపెనర్ చమరి అటపట్టు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రాణించారు. 39 బంతులు ఆడిన చమరి 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు చేయగా, 27 బంతులు ఎదుర్కొన్న హర్మన్‌ప్రీత్ ఫోర్, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసింది. ప్రియా పూనియా 11, శశికళ సిరివర్ధనే 18 పరుగులు చేశారు.
Go Back to Shorts
Supernovas
Velocity
Womens T20 Challenge 2020

More Telugu News