Family: నంద్యాలలో విషాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య

Four members of a family commits suicide
  • పాణ్యం మండలం కొల్లూరు వద్ద ఘటన
  • రైలు కిందపడి బలవన్మరణం
  • పోలీసుల వేధింపులే కారణమంటున్న కుటుంబ సభ్యులు
కర్నూలు జిల్లా నంద్యాలలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పాణ్యం మండలం కొల్లూరు వద్ద రైలు కిందపడి బలవన్మరణం చెందారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రైల్వే ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన వారిలో కుటుంబ యజమాని అబ్దుల్ సలాం కూడా ఉన్నారు. సలాం పోలీసుల వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

సలాం ఓ జ్యుయెలరీ షాపులో పనిచేస్తుండగా, ఏడాది కిందట ఆ షాపులో దొంగతనం జరిగింది. సలాం ఈ చోరీకి పాల్పడ్డాడంటూ కేసు నమోదు కాగా, అతడు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అయితే, నంద్యాల వన్ టౌన్ సీఐ కొంతకాలంగా సలాంను వేధిస్తున్నాడని, గత రాత్రి కూడా బెదిరించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో విపరీతంగా భయపడ్డాడని, అందువల్లే కుటుంబంతో సహా తనువు చాలించాడని వివరించారు.
Family
Suicide
Nandyal
Railway Track

More Telugu News