Voters: దుబ్బాక ఉప ఎన్నికలు: చివరి గంటలో కరోనా బాధితులకు ఓటేసే అవకాశం

Voters comes to polling centers in Dubbaka By Polls
  • దుబ్బాక ఉప ఎన్నికల్లో నేడు పోలింగ్
  • ఉత్సాహంగా బూత్ లకు తరలివస్తున్న ఓటర్లు
  • 3 గంటల సమయానికి 71.10 శాతం ఓటింగ్
దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాధారణ ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుండగా, ఆ తర్వాత 6 గంటల వరకు కరోనా బాధితులు ఓటేసే అవకాశం కల్పించనున్నారు. చివరి గంట పోలింగ్ కరోనా బాధితుల కోసం కేటాయించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా, దుబ్బాకలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 55.52 శాతం ఓట్లు పోలవగా, 3 గంటల సమయానికి 71.10 శాతం పోలింగ్ జరిగింది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తుండడంతో ఓటింగ్ శాతం అంతకంతకు పెరుగుతోంది. పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 
Voters
Dubbaka
By Polls
Corona Virus
Positive
Telangana

More Telugu News